Daggubati Purandeswari : నిధులు పక్కదారి పట్టిస్తే ఎలా
బీజేపీ చీఫ్ పురందేశ్వరి ప్రశ్న
Daggubati Purandeswari : ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని , మాయ మాటలతో ప్రజలను ఇంకెంత కాలం మభ్య పెడతారంటూ ప్రశ్నించారు.
Daggubati Purandeswari Asking
ఇప్పటికే రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తోందన్నారు. అయినా కేంద్రం ఇచ్చే నిధులను జగన్ రెడ్డి ఇతర సంక్షేమ పథకాల కోసం మళ్లించాడని సంచలన ఆరోపణలు చేశారు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari).
కేవలం ఒక్క సంవత్సరంలోనే (2020-2021) ఏపీ ప్రభుత్వం లెక్కల్లో చూపకుండా 1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ధ్వజమెత్తారు. ఈ మొత్తం నిధులను అనధికారికంగా ఖర్చు చేశారంటూ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) తన నివేదికలో స్పష్టం చేసిందన్నారు బీజేపీ చీఫ్. అయితే ఏపీ ప్రభుత్వం తమ ప్రచారం తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచన లేదని పేర్కొన్నారు పురందేశ్వరి.
చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read : Nara Lokesh : జగన్ పాలన జనం వేదన