Daggubati Purandeswari : జగన్ పాలనలో జనం గగ్గోలు
బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఫైర్
Daggubati Purandeswari : పాలకొల్లు – ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మరింత దూకుడు పెంచారు. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఫోకస్ పెట్టారు. ఇంకా ఎన్నికలు జరిగేందుకు కేవలం 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నయంగా ఎదిగేందుకు ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు.
Daggubati Purandeswari Comments on AP CM YS Jagan
ఆదివారం పాలకొల్లులో పర్యటించారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో బీజేపీ బలీయమైన శక్తిగా మార బోతోందని జోష్యం చేశారు. దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) మీడియాతో మాట్లాడుతూ జగన్ సీఎంగా పనికి రాడని పేర్కొన్నారు.
ఇంకెంత కాలం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తారో చెప్పాలని నిలదీశారు. ఇవాళ ఏ ఒక్క సామాజిక వర్గం సంతృప్తితో లేదన్నారు. ఏపీలో జగన్ రెడ్డి సాగిస్తున్న అరాచక పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. తాము రాష్ట్రంలో నిర్ణయాత్మక పోషించే స్థాయికి చేరుకుంటామని చెప్పారు.
దేశంలో ఇప్పుడు ప్రజలంతా సుస్థిరమైన పాలనను అందించే సత్తా కలిగిన పార్టీగా బీజేపీని ఎంచుకుంటున్నారని అన్నారు పురందేశ్వరి. రహదారుల అభివృద్ది, వంతెనల నిర్మాణాలకు కేంద్రం వేల కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు.
వైసీపీ సర్కార్ ప్రాంతాలు, కులాల మధ్య కుమ్ములాటలు పెట్టేలా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు బీజేపీ చీఫ్.
Also Read : Sridhar Babu : కక్ష సాధింపు చర్యలు ఉండవు