Daggubati Purandeswari : స్టాలిన్ కామెంట్స్ బాధాకరం
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari : ఆంధ్ర ప్రదేశ్- బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) నిప్పులు చెరిగారు. ఆమె తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. సనాతన ధర్మం గురించి తప్పుడు కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఇది అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Daggubati Purandeswari Slams Udhayanidhi Stalin
ఉదయనిధి స్టాలిన్ పూర్తిగా హిందువుల మనో భావాలను, ప్రత్యేకించి అనాది నుంచి కాపాడుకుంటూ వస్తున్న సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం మంచి పద్దతి కాదని సూచించారు. దీనిని భారతీయులైన ప్రతి ఒక్క హిందువు వ్యతిరేకించాలని, ఖండించాలని పిలుపునిచ్చారు దగ్గుబాటి పురందేశ్వరి.
ఇదే మంత్రి భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. కొన్ని తరాల నుంచి సనాతన ధర్మం కొనసాగుతూ వస్తోందని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని, దోమలు, మలేరియాతో పోల్చడం ఎంత వరకు సబబు అని నిలదీశారు దగ్గుబాటి పురందేశ్వరి.
సనాతన ధర్మాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రతిపక్షాలతో కూడిన కూటమి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన చెందారు.
Also Read : Minister KTR : తెలంగాణ అభివృద్ది దేశానికి దిక్సూచి