Daggubati Purandeswari : జగన్ సర్కార్ పై పురందేశ్వరి గరం
రూ. 20 వేల కోట్లు ఇచ్చాం
Daggubati Purandeswari : ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసిందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మంజూరైన నిధులను ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం చేయడం దారుణమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పేదలు, నిరుపేదలు, మధ్య తరగతి వాసులకు ఇళ్లు అనేది సమాజంలో గుర్తింపు ఇస్తుందన్నారు. ఇందులో భాగంగా కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన , తదతిర స్కీంలు ప్రవేశ పెట్టిందన్నారు. దేశంలో గతంలో ఎక్కడా లేని రీతిలో మోదీ ప్రజల కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం ఏకంగా రూ. 20,000 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati purandeswari). ప్రస్తుతానికి 65 శాతం నిధులు ఇచ్చిందని తెలిపారు. కానీ మొత్తంగా 35 శాతానికి సంబంధించిన పనులు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్. ఇకనైనా ప్రభుత్వం తన పనితీరును మార్చుకోవాలని సూచించారు.
తమ పార్టీ మాత్రమే రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు పురదేశ్వరి.
Also Read : Chandrababu Naidu : టీచర్ హత్యపై చంద్రబాబు ఫైర్
