Daggubati Purandeswari : జగన్ సర్కార్ పై పురందేశ్వరి ఫైర్
లక్షా 80 వేల ఇళ్లకు 2,100 ఇళ్ల నిర్మాణం
Daggubati Purandeswari : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి దూకుడు పెంచారు. ఏపీ జగన్ సర్కార్ పై నిత్యం నిప్పులు చెరుగుతున్నారు. అంకెలతో సహా నిధుల మంజూరు గురించి చెబుతున్నారు. ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇళ్ల నిర్మాణంలో ఎందుకు ఏపీ సర్కార్ ఆలస్యం చేస్తుందో చెప్పాలన్నారు.
Daggubati Purandeswari Demanding
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 1, 80, 000 ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఇందుకు సంబంధించి డబ్బులు కూడా ఇచ్చిందని కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 2,100 ఇళ్లను మాత్రమే నిర్మించిందని సంచలన ఆరోపణలు చేశారు.
దీనికి సీఎం బేషరతుగా వివరణ ఇవ్వాలని దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) డిమాండ్ చేశారు. ఓ వైపు కేంద్రం అన్ని రకాలుగా ఏపీ రాష్ట్ర అభివృద్ది కోసం ప్రయత్నం చేస్తోందని కానీ ప్రభుత్వం మాత్రం తమ పేరుతో ప్రచారం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు దగ్గుబాటి పురందేశ్వరి. ఇకనైనా ప్రజలకు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ చీఫ్.
Also Read : Rajinikanth kavya Maran : అయ్యో కావ్యా ఎందుకిలా – తలైవా