Daggubati Purandeswari : బీజేపీ నా మట్టి నా దేశం
దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. నా మట్టి నా దేశం పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఆ పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari). అందరం కలిసి అందరి కోసం పని చేయాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మనమంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
Daggubati Purandeswari Start New Program
ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు బీజేపీ చీఫ్ జోన్ల వారీగా సమీక్షలు చేపట్టారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా ఏర్పాటు చేశారు. ఆయా జోన్లకు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులను నియమించింది. ఆయా జోన్లకు కాశీ విశ్వ నాథ రాజు, గార పాటి సీతా రామాంజనేయ చౌదరి, బిట్ర శివన్నారయణ, దయాకర్ రెడ్డిలను పర్యేవేక్షిస్తారని తెలిపారు దగ్గుబాటి పురందేశ్వరి.
అంతే కాకుండా నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని ప్రతి రోజూ పర్యవేక్షించేందుకు గాను ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు వేటుకూరి సత్య నారాయణ రాజు కన్వీనర్ గా వల్లూరు జయ ప్రకాశ్ , సురేంద్ర మోహన్ , నిషీధ రాజులను సభ్యులుగా నియమించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం 15 రోజుల పాటు జరగనుందని తెలిపారు.
ఇందులో గ్రామీణ భారతానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మట్టి విలువను తెలియ చేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలన్నదే ఈ కార్యక్రమ సంకల్పమన్నారు. ఈ సందర్భంగా మోదీ అందించిన పంచ ప్రాణ్ ప్రతిష్టను పఠించడం జరుగుతుందన్నారు.
Also Read : TTD EO : బ్రహ్మోత్సవాలకు సహకరించండి