Daggubati Purandewari : బాబు అరెస్ట్ అప్రజాస్వామికం
దగ్గుబాటి పురందేశ్వరి కామెంట్
Daggubati Purandewari : ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శనివారం ఆమె స్పందించారు. నంద్యాలలో టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో కీలకమైన పాత్ర పోషించారని, ఆయనను ఏ1 నిందితుడిగా చేర్చామని స్పష్టం చేశారు.
Daggubati Purandewari Comments Viral
పక్కా ఆధారాలతో తాము అరెస్ట్ చేశామని స్పష్టం చేసింది. చంద్రబాబు నాయుడును నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా బాబును అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandewari). ఆయన అరెస్ట్ అప్రజాస్వామికమని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడి పట్ల ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని స్పష్టం చేశారు. సరైన నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ నిప్పులు చెరిగారు.
ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అనుమానం ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఇది తెలుసు కోకుండా పురందేశ్వరి స్పందించడం దారుణమన్నారు.
Also Read : Nara Lokesh : నా తండ్రిని కలిసే హక్కు లేదా