Dalai Lama : జ‌మ్మూ కాశ్మీర్ లో ద‌లైలామా ప‌ర్య‌ట‌న

రెండేళ్ల త‌ర్వాత మొద‌టిసారి టూర్

Dalai Lama : ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త ద‌లైలామా రెండేళ్ల త‌ర్వాత జ‌మ్మూ, కాశ్మీర్ లో ప‌ర్య‌టిస్తున్నారు. గురువారం నుంచి త‌న టూర్ ప్రారంభించారు.

భార‌త దేశం, చైనా దేశాల మ‌ధ్య 16వ రౌండ్ కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి స‌మావేశాల‌కు కేవ‌లం మూడు రోజుల ముందు ప‌ర్య‌టించడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఈ కీల‌క భేటీ ఈనెల 17న ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. టిబెట్ ఆధ్యాత్మిక నాయ‌కుడు ద‌లైలామా జ‌మ్మూ కాశ్మీర్ , ల‌డ‌ఖ్ లో రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు.

త‌న టూర్ లో భాగంగా ద‌లైలామా(Dalai Lama) లేహ్ లోని ప్ర‌సిద్ధ థిక్సే ఆశ్ర‌మాన్ని సంద‌ర్శిస్తార‌ని భావిస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందిన‌ప్ప‌టి నుండి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర్మ‌శాల‌లో త‌న స్థావ‌రం వెలుప‌ల మొద‌టి అధికారిక ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించారు.

ఇటీవ‌లే త‌న 87వ పుట్టిన రోజు జ‌రుపుకున్నారు ద‌లైలామా. చైనా అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకునేందుకు భార‌త్ టిబెట్ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్త‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది చైనా.

ప్ర‌ధాని మోదీని విమ‌ర్శించినందుకు టిబెట్ ఆధ్యాత్మిక నాయ‌కుడిపై మండిప‌డ్డారు. ఓ వైపు డ్రాగ‌న్ అభ్యంత‌రం చెప్పినా, తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించినా ప‌ట్టించు కోలేదు ద‌లైలామా.

ఇదిలా ఉండ‌గా భార‌త దేశంలో ద‌లైలామాను అతిథిగా ప‌రిగ‌ణించ‌డం త‌మ స్థిర‌మైన‌ విధాన‌మ‌ని పేర్కొంది మోదీ స‌ర్కార్. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు భార‌త దేశ విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి.

ద‌లైలామా భార‌త‌దేశంలో ఆశ్ర‌యం పొందిన‌ప్ప‌టి నుండి బీజింగ్ కు అత‌నితో ఎప్పుడూ స‌మ‌స్య ఉంది. కాగా టిబెట్ స‌మ‌స్య‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించేందుకు చైనాతో మ‌ధ్యంత‌ర చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ద‌లైలామా కోరుతున్నారు.

Also Read : శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శ్రీ‌కారం

Leave A Reply

Your Email Id will not be published!