CM KCR : అంబేద్కర్ స్పూర్తితోనే దళితబంధు
వర్ధంతి సందర్బంగా సీఎం కేసీఆర్
CM KCR : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఇవాళ. ఆ మహోన్నత మానవుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆధిపత్య ధోరణలు ఉండ కూడదని, వివక్షకు తావు ఇవ్వకూడదని, సమస్త ప్రజలంతా స్వేచ్ఛతో బతికేలా ఉండాలని కోరుకున్నారు.
కార్ల్ మార్క్స్ సమ సమాజం కోరుకుంటే అంబేద్కర్ అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని..వసుధైక కుటుంబంగా కలిసి మెలిసి జీవించాలని ఆశించాడని అన్నారు సీఎం కేసీఆర్.
డిసెంబర్ 6 డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్దంతి. ఈ సందర్భంగా సీఎం(CM KCR) ఆయనకు నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తితోనే అణగారిన వర్గాలకు చెందిన దళితుల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేని రీతిలో తాను దళిత బంధు తీసుకు వచ్చానని స్పష్టం చేశారు. నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 10 లక్షలు వేస్తామని తెలిపారు. ఇలాంటి పథకం దేశ చరిత్రలో ఎక్కడా లేదని ఒక్క తెలంగాణలో మాత్రమే ఉందన్నారు కేసీఆర్.
తన జీవిత కాలమంతా బడుగు, పేదలు, బలహీన, నిమ్న వర్గాల కోసం పని చేశారని ప్రశంసించారు. ప్రపంచ మేధావులలో బిఆర్ అంబేద్కర్ నిలిచారని కొనియాడారు.
ఆయన జీవితం సదా స్మరణీయమని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం అందాలన్న సత్ సంకల్పంతో రూపొందించిన రాజ్యాంగం యావత్ ప్రపంచానికి ఓ దిక్సూచి లాంటిదని ప్రశంసించారు కేసీఆర్. ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసమే తాము దళిత బంధు తెచ్చామన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటు కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే కారణమైందన్నారు. కొత్త సచివాలయానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంగా మార్చామన్నారు సీఎం.
Also Read : కవిత యూటర్న్ నేను ఫుల్ బిజీ