Damodara Raja Narasihma : దామోదర రాజనర్సింహ గెలుపు
క్రాంతి కిరణ్ ఘోర పరాజయం
Damodara Raja Narasihma : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. ఊహించని రీతిలో మహామహులు, ప్రముఖ నేతలకు ఝలక్ ఇచ్చారు జనం. 119 స్థానాలకు గాను 65 స్థానాలకు పైగా లీడింగ్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా కొన్ని స్థానాలలో లీడ్ లో కొనసాగుతోంది. ఊహించని రీతిలో బీజేపీ ముందంజలోకి రావడం విస్తు పోయేలా చేసింది.
Damodara Raja Narasihma Winnings
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేసులో ఉన్న సీనియర్ నేతలు గ్రాండ్ విక్టరీని నమోదు చేశారు. సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డి , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ(Damodara Raja Narasihma) అద్భుత విజయాన్ని సాధించారు.
ఇక ఆందోల్ శాసన సభ నియోజకవర్గంలో బరిలోకి దిగిన దామోదర తన సమీప ప్రత్యర్థి క్రాంతి కిరణ్ పై భారీ తేడాతో గెలుపొందారు. చంటి క్రాంతి కిరణ్ పై 24 వేల 422 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరో వైపు పాలకుర్తి నియోజకవర్గంలో ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు ఎన్నారై యశస్విని రెడ్డి.
మధిరలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ఘన విజయాన్ని నమోదు చేశారు.
Also Read : CM KCR Loss : కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి