Damodara Raja Narasimha : కరోనా పట్ల అప్రమత్తం అవసరం
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
Damodara Raja Narasimha : హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా భయం అలుముకుంది. కేరళలో తాజాగా కరోనా రూపంలో కొత్త వేరియంట్ రావడంతో జనం భయంతో వణుకుతున్నారు. దీంతో అత్యవసరంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Damodara Raja Narasimha Comment about Covid
కరోనా ప్రమాదకరమైన వ్యాధి అని దాని నుంచి రక్షించు కునేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులలో కరోనా నివారణకు సంబంధించి మాస్క్ లు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
ఇప్పటికే కేంద్రం ఏర్పాట్లు చేసిందన్నారు. అవసరమైతే ఎంత ఖర్చు అయినా సరే ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా చూడాలని స్పష్టం చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ(Damodara Raja Narasimha). ఇవాళ ఆయన సమీక్ష చేపట్టారు.
ఇదిలా ఉండగా డిసెంబర్ 19న మంగళవారం నాలుగు కొత్తగా కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 9 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు వెల్లడించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు.
Also Read : Ganta Srinivasa Rao : తెలుగుదేశం విజయం ఖాయం