Anil Kumar Singhal : టోకెన్లు ఉంటేనే స్వామి దర్శనం
లేకపోతే ఉండదన్న టీటీడీ ఈవో
Anil Kumar Singhal : రానున్నది వైకుంఠ ఏకాదశి. ఈ పర్వదినం రోజున ఆలయాలకు భక్తులు పోటెత్తడం ఖాయం. దీంతో ముందుగానే అప్రమత్తమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పటికే కరోనా దెబ్బకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో కోవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది టీటీడీ.
ఇదిలా ఉండగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి వచ్చే ఏడాది 2023 జనవరి 1 నుంచి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు టీటీడీ తాత్కాలిక ఈవో అనిల్ కుమార్ సింఘాల్(Anil Kumar Singhal). ఒకవేళ టోకెన్లు లేకుంటే దర్శనానికి అవకాశం ఉండదన్నారు. ఇప్పటికే భక్తులతో తిరుమల నిండి పోయిందని తెలిపారు.
స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా తిరుమల వెబ్ సైట్ , శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ,ఇతర, ప్రచురణ, ప్రసార, డిజిటల్ మాధ్యమాల సమాచారం తెలుసు కోవాలని సూచించారు. ముందే వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరారు. భక్తుల రద్దీ దృష్ట్యా తమతో సహకరించాలని అనిల్ కుమార్ సింఘాల్ కోరారు.
టోకెన్లలో తమకు కేటాయించిన తేదీ, సమయం, స్థలం ఉంటుందని దాని ఆధారంగా ముందే వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అంతకంటే ముందే రావడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని పేర్కొన్నారు టీటీడీ ఈవో. ఈ సందర్భంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదిలా ఉండగా వైకుంఠ ద్వారా దర్శనం జనవరి 2 నుంచి 11 వరకు 10 రోజుల పాటు ఉంటుందని స్పష్టం చేశారు అనిల్ కుమార్ సింఘాల్.
జనవరి 1 నుంచి ఆన్ లైన్ ద్వారా రూ. 300 , ఎస్ఇడి టికెట్లు 2 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.
Also Read : దర్శన విధానంలో మార్పు లేదు – టీటీడీ