Dasoju Sravan : రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి
డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్
Dasoju Sravan : బీఆర్ఎస్ అగ్ర నేత దాసోజు శ్రవణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. అమెరికాలో తానా వేదికగా రైతులకు సంబంధించిన ఉచిత విద్యుత్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా రైతుల మనోభావాలను దెబ్బ తీసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ పై బాధ్యతా రాహిత్యంతో సిగ్గు లేకుండా సమర్థించడం దారుణమని పేర్కొన్నారు.
నోటికి వచ్చినట్లు మాట్లాడే రేవంత్ రెడ్డిని ప్రజా జీవితంలో నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు . కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకుండా కర్ణాటక, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లోని రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సవాల్ చేశారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan). రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన మోస పూరిత వ్యూహాల గురించి ప్రస్తావించారు.
రేవంత్ రెడ్డి వ్యవసాయంపై అవగాహన లేమి తెలియ చేస్తుందని , రైతుల పట్ల అసహనాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. ప్రజల మనోభావాలు దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ నుంచి రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.
Also Read : Chandrayan-3 Comment : నీలి మేఘమా ‘చందమామ’