Dasoju Sravan : నా తండ్రి నాకు ఆదర్శం – శ్రవణ్
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆవేదన
Dasoju Sravan : బీఆర్ఎస్ థింక్ ట్యాంకర్ లలో ఒకడిగా పేరు పొందిన దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 18న ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని తలుచుకున్నారు. ట్విట్టర్ వేదికగా తను లేక పోతే నేను లేనని పేర్కొన్నారు. మా నాన్న ఎంతో కష్టపడి చదివించి ఇంతటి స్థాయికి తీసుకు వచ్చారని తెలిపారు. కరోనా కష్ట కాంలో తాను 2020లో తన తండ్రి దాసోజు కృష్ణమా చారిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో నిజమైన స్నేహితుడు, స్పూర్తి దాయకంగా నిలిచిన ఏకైక వ్యక్తి తండ్రి అని పేర్కొన్నారు.
నా తండ్రి కృష్ణమా చారి అపారమైన వివేకం కలిగిన మహానుభావుడు. ఆయన చేసిన కృషి, నిజాయితీ , మానవత్వానికి ప్రసిద్ది పొందారని తెలిపారు. నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చినా ఎల్లప్పుడూ గొప్ప ఆదర్శనాలను కలిగి ఉన్నాడని ప్రశంసించారు. పేదలకు సేవ చేయడం నిజమైన మానవుల లక్ష్యమని తను ఎల్లప్పుడూ చెబుతూ వచ్చారని పేర్కొన్నారు. ఆయన నేర్పిన పాఠాలే తాను ఇప్పటికీ పాటిస్తున్నానని దాసోజు శ్రవణ్(Dasoju Sravan) స్పష్టం చేశారు.
నా తండ్రి నాకు ఎల్లప్పుడూ ఒకటే చెప్పే వారు. అదేమిటంటే ఏమీ అడగ వద్దు, ప్రతిఫలంగా ఏదీ ఇవ్వవద్దు. మీరు ఇవ్వాల్సింది చేతనైతే ఇవ్వండి. అది మీకు రావాలని అనుకుంటే తిరిగి వస్తుందని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. నేను మీ ప్రేమను, ఆప్యాయతను , నిరంతర మార్గదర్శకత్వాన్ని మిస్ అవుతున్నానని వాపోయారు దాసోజు శ్రవణ్.
Also Read : Bandi Sanjay : పగటి కలలు కంటున్న కాంగ్రెస్ – బండి