Dasoju Sravan : తీర్పు స్పష్టం బీఆర్ఎస్ విజయం
బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణి
Dasoju Sravan : హైదరాబాద్ – కాంగ్రెస్ బలుపు చూసుకుని వాపు అనుకుంటోందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ దాసోజు శ్రవణ్. శనివారం ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. ఇందులో అనుమానం చెందాల్సిన అవసరం ఉందన్నారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan). మూడోసారి ముచ్చటగా సీఎం కావడం ఖాయమన్నారు.
Dasoju Sravan Comment
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అర్థం పర్థం లేని ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చౌకబారు రాజకీయాలపై ధీటుగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుల లేకి ప్రవర్తనను, చిల్లర ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో దుయ్య బట్టారు దాసోజు శ్రవణ్.
తీర్పు స్పష్టంగా ఉందన్నారు. సైలెంట్ ఓటు బ్యాంకు పూర్తిగా తమ వైపు ఉంటుందన్నారు . టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు కలల్లో తేలి యాడుతున్నారని వారి కలలు కల్లలు కాక తప్పదన్నారు. ఇకనైనా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మాను కోవాలని సూచించారు.
తప్పకుండా తాము గెలుస్తామని , బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని పేర్కొన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్.
Also Read : Vijaya Shanti : కారు పంక్చర్ ఖాయం