Dasoju Sravan : ‘గంగాపురం’పై దాసోజు గరం
మణిపూర్ తో సంబంధం లేదంటావా
Dasoju Sravan : ఓ వైపు మణిపూర్ తగలబడి పోతోంది. కానీ బాధ్యత కలిగిన పదవిలో ఉన్న గంగాపురం కిషన్ రెడ్డి బాధ్యతా రాహిత్యంగా ఎలా మాట్లాడాతారంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అగ్ర నాయకుడు దాసోజు శ్రవణ్. ఇప్పటి వరకు రాష్ట్రంలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 10 వేల మందికి పైగా సైనిక బలగాలు మోహరించాయని కానీ ఇప్పటి వరకు అల్లర్లు కంట్రోల్ కాలేదన్నారు.
Dasoju Sravan Asking
దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలని స్పష్టం చస్త్రశారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan). మతం పేరుతో, కులం పేరుతో, జాతుల పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ది పొందాలని అనుకోవడం దారుణమన్నారు. ఇవాళ కేంద్రంలో, మణిపూర్ లో కొనసాగుతున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలేనని మరి ఎందుకు కంట్రోల్ కావడం లేదంటూ ప్రశ్నించారు.
చివరకు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మణిపూర్ తో నాకేం సంబంధం అనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు గంగాపురం కిషన్ రెడ్డిని. ఇకనైనా తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్.
Also Read : Prabhas Dominate : టాలీవుడ్ లో ప్రభాస్ హవా