Centre VS Delhi : 27న కేంద్రం..ఢిల్లీ వివాదంపై తీర్పు

టైమ్ లైన్ ను ఖ‌రారు చేసిన సుప్రీంకోర్టు

Centre VS Delhi : ఢిల్లీ ప్ర‌భుత్వం, కేంద్ర స‌ర్కార్ కు మ‌ధ్య నెల‌కొన్న వివాదాల‌కు ఎట్ట‌కేల‌కు తెర దించేందుకు ఖ‌రారు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం.

గ‌త కొంత కాలంగా త‌మ‌పై కేంద్రం పెత్త‌నం ఏంటి అంటూ మండిప‌డుతోంది, ప్ర‌శ్నిస్తోంది ఢిల్లీ ఆప్ స‌ర్కార్(Centre VS Delhi). కేంద్ర పాలిత ప్రాంతం కావ‌డంతో త‌మ‌కే స‌ర్వ హ‌క్కులు దేశ రాజ‌ధాని ఢిల్లీపై ఉంటాయ‌ని కేంద్రం వాదిస్తోంది.

దీంతో అటు కేంద్రం , ఇటు ఢిల్లీ ప్ర‌భుత్వం వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. విచార‌ణ చేప‌ట్ట‌డం, వాయిదా ప‌డ‌టం కొన‌సాగుతూ వ‌స్తున్న‌ది.

తాజాగా ఇరువురి మ‌ధ్య నెల‌కొన్న భేదాభిప్రాయాల‌ను, ఎవ‌రికి ఏమేం హ‌క్కులు ఉండ బోతున్నాయ‌నే అంశాల‌పై కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించేందుకు సుప్రీంకోర్టు ధ‌ర‌స్మానం ఖ‌రారు చేసింది.

ఇందులో భాగంగా సెప్టెంబ‌ర్ 27 టైమ్ లైన్ ఖ‌రారు చేసింది. ఢిల్లీలో సేవ‌ల నియంత్ర‌ణ‌పై విచార‌ణ‌కు జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ‌మూర్తుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు ఆగ‌స్టు 22న పేర్కొంది.

ఈ మేర‌కు ఈ అంశాన్ని మే 6న రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి రిఫ‌ర్ చేశారు. ఇది గ్రీన్ బెంచ్ అని , విచార‌ణ‌లో ఎటువంటి కాగితాల‌ను ఉప‌యోగించ రాద‌ని సుప్రీంకోర్టు తెలిపింది.

న్యాయ‌మూర్తులు ఎం. ఆర్. షా, కృష్ణ మురారి, హిమా కోహ్లీ, పీ.ఎస్. న‌ర‌సింహ‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారిస్తుంది. కేంద్రం, ఢిల్లీ ప్ర‌భుత్వ శాస‌న‌, కార్య నిర్వాహ‌క అధికారాల ప‌రిధికి సంబంధించిన వ్యాజ్యాన్ని విచార‌ణ చేప‌డుతుంది.

అంతే కాకుండా ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు అడ్మిష‌న్లు, ఉద్యోగాల్లో 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న కేంద్రం నిర్ణ‌యం చెల్లుబాటుపై సీజేఐ ల‌లిత్ ఆధ్వ‌ర్యంలో 13 నుంచి విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

Also Read : గుర్తింపు లేని పార్టీల నిధుల‌పై ఐటీ దాడులు

Leave A Reply

Your Email Id will not be published!