David Warner : త‌గ్గ‌నంటున్న‌ వార్న‌ర్ భ‌య్యా

పుష్ప మార్ఫింగ్ వీడియోతో హ‌ల్ చ‌ల్

David Warner : ఆసిస్ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ అటు ఆట‌లోనే కాదు ఇటు తెలుగు మూవీ సాంగ్స్, డైలాగ్స్ తో కూడా దుమ్ము రేపుతున్నాడు. మ‌నోడికి తెలుగు వారితో అనుబంధం ఎక్కువ‌.

ఎందుకంటే ఎప్పుడైతే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ స‌న్ రైజ‌ర్స్ ఆఫ్ హైద‌రాబాద్ తో ట‌చ్ లోకి వ‌చ్చాడో ఇక అక్క‌డి నుంచి జ‌నాద‌ర‌ణ పొందే మూవీస్ ను ఫాలో అవుతూ వ‌స్తున్నాడు.

ఏ మాత్రం టైం చిక్కితే చాలు వార్న‌ర్ భ‌య్యా వీడియోలు షేర్ చేస్తాడు. అంతే కాదు ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ల‌తో హోరెత్తిస్తాడు. తాజాగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ల‌వ్లీ గ‌ర్ల్ ర‌ష్మిక మందాన క‌లిసి న‌టించిను పుష్ప రాజ్ మూవీ రికార్డు బ్రేక్ చేసింది.

పాన్ ఇండియా మూవీగా కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన సంగీతం, పాట‌లు మిలియ‌న్ల కొద్దీ చూస్తున్నారు. ఇక యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి పుష్ప సాంగ్స్ .

తాజాగా మ‌న డేవిడ్ వార్న‌ర్(David Warner) భ‌య్యా ఊరుకుంటాడా. ఇంకేం పుష్ప మూవీని మ‌క్కీకి మ‌క్కీ దించేస్తున్నాడు. రోజుకో పోస్టు పెడుతూ, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు.

తాజాగా అల్లు అర్జున్ వీడియోను మార్ఫింగ్ చేస్తూ తీసిన వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్ప‌డు నెట్టింట్లో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాడు. ఇదిలా ఉండ‌గా పుష్ప మూవీకి ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే ఫుల్ ప్ర‌చారాన్ని చేసి పెట్టాడు డేవిడ్ వార్న‌ర్.

శ్రీ‌లంక టీ20 సీరీస్ కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఈ క్రికెట‌ర్ ఇప్పుడు పుష్ప మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

Also Read : అవ‌కాశాలు స‌రిగా వాడుకోలేదు

Leave A Reply

Your Email Id will not be published!