Pragya Thakur : ప్రగ్యా ఠాకూర్ కు దావూద్ సోదరుడి బెదిరింపు
బీజేపీ ఎంపీ సాధ్వి ఠాకూర్ ఫిర్యాదు
Pragya Thakur : భారతీయ జనతా పార్టీ ఎంపీ , ఫైర్ బ్రాండ్ గా పేరొందిన సాధ్వి ప్రగ్యా ఠాకూర్(Pragya Thakur) సంచలన కామెంట్స్ చేశారు. ఇంటర్నేషనల్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదురుడి నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు.
ఈ మేరకు ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రగ్యా ఠాకూర్ చర్చనీయాంశంగా మారారు. భారతీయ జనతా పార్టీలో కలకలం రేగింది.
ఇప్పటికే మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మతో పాటు బీజేపీ ఢిల్లీ మీడియా ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ ను పార్టీ నుంచి బహిష్కరించారు.
ఇక నూపుర్ శర్మపై ముంబై , కోల్ కతా లో కేసులు నమోదు అయ్యాయి. ఆమెకు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా నూపుర్ శర్మకు మద్దతు ప్రకటించారు ఎంపీ ప్రగ్యా ఠాకూర్.
ఆమె అన్నదాంట్లో తప్పేముందంటూ ప్రశ్నించారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ముస్లిం వర్గాలను ఆగ్రహానికి తెప్పించాయి.
తనను చంపుతామంటూ మాఫియా డాన్ దావూద్ తమ్ముడి నుంచి పలుమార్లు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయని ఆరోపించింది ప్రగ్యా ఠాకూర్(Pragya Thakur).
ఈ సందర్భంగా కాలర్ తో మాట్లాడుతున్నట్లు చూపించే వీడియో కూడా పోస్ట్ చేశారు ఎంపీ. ప్రస్తుతం ఎంపీ పోస్ట్ చేసిన ట్వీట్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శనివారం రోజు కాల్ వచ్చిందని, ఆ కాల్ చేసిన వ్యక్తి తనను తాను పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ అని చెప్పాడని ఆరోపించారు ప్రగ్యా ఠాకూర్.
ముస్లింలను టార్గెట్ చేస్తున్నందుకు చంపుతానంటూ బెదిరించాడని ఫిర్యాదు చేశారు. ఇవాళ తెల్లవారుజామున టీటీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Also Read : రాష్ట్రపతి పదవి కంటే రాష్ట్రం ముఖ్యం