Dayanidhi Maran : బీజేపీ గెలవని చోట దాడులు – మారన్
కేంద్ర సర్కార్ పై డీఎంకే ఎంపీ ఫైర్
Dayanidhi Maran : మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ ను ఏకి పారేశారు డీఎంకే ఎంపీ దయానిధి మారన్. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు తీసుకు రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దీనిపై చర్చలు జరిగిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. భారత రాజ్యాంగ స్పూర్తికి ఇది పూర్తిగా విరుద్దమన్నారు.
Dayanidhi Maran Comments
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించిందని స్పష్టం చేశారు. అయినా ఎందుకని మోదీ సర్కార్ పదే పదే కావాలని బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ గెలవని చోట కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ, సీబీఐ లతో దాడులకు పాల్పడుతోందని దయానిధి మారన్(Dayanidhi Maran) ధ్వజమెత్తారు.
పోలీస్, పబ్లిక్ ఆర్డర్ , ల్యాండ్ మినహా ఏ అధికారాలు కేంద్రానికి, సర్కార్ నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉండవని స్పష్టం చేశారని ఆ విషయం కూడా తెలుసుకోకుండా కయ్యానికి కాలు దువ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని పొడిగించడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందని చెప్పారు. పార్లమెంట్ అత్యుత్తమమైన సంస్థ కాదనలేం. కానీ సుప్రీం తీర్పును కూడా పరిగణలోకి తీసుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు మారన్.
Also Read : CM KCR Assurance : సాయన్న కుటుంబానికి సీఎం భరోసా
