Venkattram Reddy Arrest : వెంక‌ట్రామ్ రెడ్డి అరెస్ట్

డెక్క‌న్ క్రానిక‌ల్ చైర్మ‌న్

Venkattram Reddy Arrest : దేశ వ్యాప్తంగా బుధ‌వారం కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ తెల్ల వారు జామున త‌మిళ‌నాడులో కొలువు తీరిన డీఎంకే స‌ర్కార్ కు షాక్ ఇచ్చింది ఈడీ. అక్క‌డ విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని అదుపులోకి తీసుకుంది. ఇక ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో మీడియా బార‌న్ గా పేరు పొందిన డెక్క‌న్ క్రానిక‌ల్ దిన‌ప‌త్రిక చైర్మ‌న్ , ఎండీ గా ఉన్న వెంక‌ట్రామ్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. మ‌నీ లాండ‌రింగ్ తో పాటు బ్యాంకుకు భారీగా క‌న్నం వేశాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

ఆయ‌న‌తో పాటు పీకే అయ్య‌ర్ ను కూడా అదుపులోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆడిట‌ర్ మ‌ణి ఊమెన్ ను కూడా అరెస్ట్ చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న చైర్మ‌న్, ఆడిట‌ర్ తో పాటు మ‌రొక‌రిని మ‌నీ లాండ‌రింగ్ కోర్టు లో హాజ‌రు ప‌ర్చ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా డెక్క‌న్ క్రానిక‌ల్ చైర్మ‌న్ గా ఉన్న వెంక‌ట్రామ్ రెడ్డి(Venkattram reddy) కెన‌రా బ్యాంకుతో పాటు ఐడీబీఐ బ్యాంకులో భారీ ఎత్తున రుణాలు తీసుకున్నారు.

ఆపై ఒక్క పైసా కూడా చెల్లించ లేదు. ఆపై రుణాలు భారీగా పేరుకు పోయాయి. ఈ రెండు బ్యాంకులు మోసానికి గురైన‌ట్లు గుర్తించాయి. ఈ మేరకు నోటీసులు జారీ చేశాయి. ఈ కేసుకు సంబంధించి హైద‌రాబాద్ , బెంగ‌ళూరు, ఢిల్లీలోని ప‌లు చోట్ల రూ. 264 కోట్ల విలువైన ఆస్తుల‌ను కూడా జ‌ప్తు చేసింది. ఇక మొత్తం రుణాలు రూ. 8,180 కోట్ల‌కు చేరుకోవ‌డం విశేషం.

Also Read : RS Praveen Kumar : ఎక్క‌డుంది ఆరోగ్య తెలంగాణ – ఆర్ఎస్పీ

 

Leave A Reply

Your Email Id will not be published!