Narhari Zirwal : మరాఠా డిప్యూటీ స్పీకర్ నిర్ణయం కీలకం
మొత్తం రాజకీయం అతడి చుట్టే తిరుగతోంది
Narhari Zirwal : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. అందరి కళ్లు మరాఠా డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్(Narhari Zirwal) పై ఉన్నాయి. గత ఏడాది 2021 ఫిబ్రవరి నుండి రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పదవి ఖాళీగా ఉంది.
దీంతో ప్రభుత్వంపై శివసేన పార్టీకి చెందిన మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు. వారంతా ఏక్ నాథ్ షిండే సారథ్యంలో ఎమ్మెల్యేలు అస్సాంలోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేశారు.
గవర్నర్ కు ఫిర్యాదు చేసినా లేదా సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసినా అంతిమ నిర్ణయం స్పీకర్ కే అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం ఉంది.
ఇందులో భాగంగా నరహరి జిర్వాల్ తిరుగుబాటు చేసిన మంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు 16 మంది శివసేన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు డిప్యూటీ స్పీకర్. సంజాయిషీ ఇచ్చేందుకు సోమవారం 5 గంటలకు వరకు గడువు ఇచ్చారు.
ఇదే సమయంలో శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. మీరు గౌహతిలో ఎంత కాలం ఉంటారని ప్రశ్నించారు. ఎప్పుడైనా మహారాష్ట్రకు రావాల్సిందేనంటూ చెప్పారు.
ఇదిలా ఉండగా ఈ నరహరి జిర్వాల్(Narhari Zirwal) పై అందరూ ఫోకస్ పెట్టారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుండి వచ్చారు నరహరి జిర్వాల్.
మొత్తంగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కేంద్రంగా నిలిచారు. ఇదే సమయంలో ఏక్ నాథ్ షిండే శిబిరం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు.
Also Read : శివసేనను వణికిస్తున్న ఒకప్పటి ‘ఆటోడ్రైవర్’