Deepa Das Munshi : బీఆర్ఎస్ కు అంత సీన్ లేదు
కాంగ్రెస్ నేత దీపా దాస్ మున్షి
Deepa Das Munshi : తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు దీపా దాస్ మున్షీ. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.
Deepa Das Munshi Comments on BRS
సీఎం రేవంత్ రెడ్డికి మంచి పట్టుంది. ఆయనతో కలిసి పని చేస్తూ ముందుకు వెళతామని చెప్పారు దీపా దాస్ మున్షి(Deepa Das Munshi). ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
స్వేద పత్రం పేరుతో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న హంగామా బక్వాస్ అంటూ కొట్టి పారేశారు. ప్రధానంగా మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని తేలి పోయిందన్నారు. కేసీఆర్ సర్కార్ సాగించిన మోసం, చేసిన దోపిడీ, అక్రమాలకు భయపడి ప్రజలు ఇంటి బాట పట్టించారని ఆరోపించారు.
ఇప్పటికప్పుడు తమకు వచ్చిన కష్టం ఏమీ లేదన్నారు. తాము సంపూర్ణంగా 5 ఏళ్ల పాటు పాలన సాగిస్తామని చెప్పారు దీపా దాస్ మున్షి. కాంగ్రెస్ పై విమర్శలు ఆపి ముందు బీఆర్ఎస్ ఉంటుందో లేదో చూసు కోవాలని కేటీఆర్ , కేసీఆర్, కవిత, హరీష్ కు చురకలు అంటించారు.
Also Read : Ponguleti Srinivas Reddy : ధరణి పేరుతో దందా..కబ్జా