Deepak Kesarkar : సంజయ్ రౌత్ వల్లే ఈ సంక్షోభం – కేసర్కర్
ఇప్పటికీ ఉద్దవ్ ఠాక్రే అంటే మాకు గౌరవం
Deepak Kesarkar : మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం కూలి పోవడానికి ప్రధాన కారణంగా తాము కాదని పార్టీ స్పోక్స్ పర్సన్ , రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అని సంచలన ఆరోపణలు చేశారు రెబల్ శివసేన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్.
గురువారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తమపై లేని పోని ఆరోపణలు చేస్తున్న సంజయ్ రౌత్ పై నిప్పులు చెరిగారు. తాము ఇప్పటికీ బాలా సాహెబ్ ఠాక్రే వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న ఉద్దవ్ టాక్రే అంటే గౌరవం ఉందని స్పష్టం చేశారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో లోపాయికారిగా కుమ్మక్కై తీరని ద్రోహం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీపక్ కేసర్కర్(Deepak Kesarkar).
తాము ఎవరినీ వెన్నుపోటు పొడవ లేదన్నారు. రోజూ ప్రచారంలో ఉంటూ వస్తున్న సంజయ్ రౌత్ ఈ మొత్తం కూలి పోవడానికి కారకుడంటూ మరోసారి ఫైర్ అయ్యారు.
శివసేన బొమ్మతో గెలిచిన వారు వెన్ను పోటు పొడిచారు. వారిని మరాఠా ప్రజలు ఎన్నటికీ క్షమించరంటూ సంజయ్ రౌత్ ప్రకటించడాన్ని తప్పు పట్టారు.
ఎవరు ఎవరిని వెన్ను పొడిచారో ఎవరు ఇంకెవరికి ద్రోహం చేశారో వారి అంతరాత్మకు తెలుసన్నారు దీపక్ కేసర్కర్. ఠాక్రే కుటుంబానికి తాము ఎన్నటికీ వ్యతిరేకులం కామన్నారు.
మహా వికాస్ అఘాడితో తెగదెంపులు చేసుకుంటే చర్చించే వాళ్లమని అన్నారు దీపక్ కేస్కర్ . ఏది ఏమైనా కేసర్కర్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎవరు ఏమిటో ప్రజలు తేలుస్తారన్నారు.
Also Read : శివసేన అధికారం కోసం పుట్టలేదు – రౌత్
We are not against the Thackeray family… We are ready to talk to Uddhav Ji if he breaks the alliance with MVA but he is still with them. We have not gone to SC against Thackeray. We still have respect for Thackeray Ji: Deepak Kesarkar, spokesperson of the Eknath Shinde camp pic.twitter.com/mnkM4Zg2pc
— ANI (@ANI) June 30, 2022