Arvind kejriwal : కేంద్రం నాట‌కం ఎన్నిక‌ల‌కు ఆటంకం – సీఎం

సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌న్న సీఎం కేజ్రీవాల్

Arvind kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌కుండా న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు.

ఇది పూర్తిగా ప్ర‌జాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. ఒకే దేశం, ఒకే భాష‌, ఒకే పార్టీ పేరుతో రాచ‌రిక పాల‌న సాగిస్తున్న మోదీకి ఢిల్లీలో ఆప్ పాల‌న ఉండ‌డం జీర్ణించు కోలేక పోతున్నార‌ని ధ్వ‌జమెత్తారు.

కానీ కేంద్ర స‌ర్కార్ ప్ర‌య‌త్నాలు ఏవీ ఇక్క‌డ సాగ‌వ‌న్నారు. రెండు కోట్ల మందికి పైగా ఉన్న ఢిల్లీ ప్ర‌జ‌లంతా కేజ్రీవాల్ ను స్వంత కొడుకు లాగా భావిస్తున్నార‌ని చెప్పారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind kejriwal).

యూటీ పేరుతో లూటీ చేయాల‌ని చూస్తే జ‌నం క్ష‌మించ‌ర‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీని పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవ‌కాశం ఉంద‌ని, ఆ త‌ర్వాత ఇక ఎన్నిక‌లంటూ ఉండ‌వ‌ని మండిప‌డ్డారు.

వ‌ర్షాకాల స‌మావేశాల రెండో రోజు ఢిల్లీ అసెంబ్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధానిలో ఎంసీడీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ నీయ‌కుండా కేంద్ర స‌ర్కార్ బ‌ల‌వంతంగా గూండాయిజాన్ని ఉప‌యోగిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఎన్నిక‌ల‌ను స‌కాలంలో నిర్వ‌హించేందుకు ఆప్ కోర్టును ఆశ్ర‌యిస్తుంద‌ని చెప్పారు. ఆరు నూరైనా ఎన్నిక‌లు జ‌రిపి తీరుతామంటూ హెచ్చ‌రించారు ఢిల్లీ సీఎం.

డీలిమిటేష‌న్ క‌మిష‌న్ ను ఏర్పాటు చేస్తామ‌ని కేంద్రం హామీ ఇచ్చింద‌ని కానీ ఈరోజు వ‌ర‌కు దాని గురించి ఊసెత్త‌డం లేద‌ని ఆరోపంచారు. ఒక ర‌కంగా చెప్పాలంటే వారికి ఓడి పోతామేన‌న్న భ‌యం.

Also Read : యూపీ పోలీసుల తీరుపై కేజ్రీవాల్ సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!