Arvind Kejriwal : జార్ఖండ్ సీఎంతో కేజ్రీవాల్..మాన్ భేటీ

సీఎం భ‌గ‌వంత్ మాన్ కూడా

Arvind Kejriwal : ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ శుక్ర‌వారం జార్ఖండ్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరేన్ ను క‌లుసుకున్నారు. అంత‌కు ముందు సీఎంలు అర‌వింద్ కేజ్రీవాల్ , భ‌గ‌వంత్ మాన్ కు స్వాగ‌తం ప‌లికారు సీఎం. కేజ్రీవాల్(Arvind Kejriwal) , భ‌గ‌వంత్ మాన్ తో పాటు ఎంపీలు సంజ‌య్ సింగ్ , రాఘ‌వ్ చ‌ద్దా కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా గంట‌కు పైగా స‌మావేశం జ‌రిగింది. దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు ఇద్ద‌రు సీఎంలు.

అనంత‌రం కేంద్రం ఢిల్లీ ప్ర‌భుత్వానికి తీసుకు వ‌చ్చిన ఆర్డినెన్స్ కు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని సీఎం హేమంత్ సోరేన్ ను కేజ్రీవాల్ అభ్యర్థించారు. కేంద్రంలో కొలువుతీరిన మోదీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను కూడా తుంగ‌లో తొక్కిందంటూ ఈ సంద‌ర్బంగా వివ‌రించారు. ఇప్ప‌టికే తీసుకు వ‌చ్చిన ఆర్డినెన్స్ చ‌ట్టంగా అమ‌లు కావాలంటే పార్ల‌మెంట్ లోని ఉభ‌య స‌భ‌లు లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండ‌గా లోక్ స‌భ‌లో బీజేపీకి బ‌లం ఉండ‌గా రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల‌కు బ‌లం ఉంది. దీంతో ఆప్ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్ మెల మెల్ల‌గా పావులు క‌దిపారు. ఆయ‌న గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన పార్టీల‌ను క‌లుసుకున్నారు. ఇప్ప‌టికే బీహార్ సీఎం నితీశ్ కుమార్, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తు తెలిపారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌న నిర్ణ‌యాన్ని ఇంకా ప్ర‌క‌టించ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ను ముందు నుంచీ విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు కేజ్రీవాల్.

Also Read : KTR

 

Leave A Reply

Your Email Id will not be published!