Delhi Liquor Scam MLC CM : లిక్క‌ర్ స్కాంలో క‌విత‌..కేజ్రీవాల్

మ‌రోసారి ప్ర‌స్తావించిన ఈడీ

Delhi Liquor Scam MLC CM : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో(Delhi Liquor Scam) కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే ఒక‌సారి సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌విత‌ను విచారించిన ఈడీ ఉన్న‌ట్టుండి ఆమెతో పాటు ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు కూడా ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపించింది. అంతే కాదు ఇవాళ ప్ర‌త్యేక కోర్టుకు స‌మ‌ర్పించిన ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్ల‌ను చేర్చింది.

త‌న‌కు ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని, తాను ఎలాంటి విచార‌ణ‌ను ఎదుర్కొనేందుకైనా సిద్దంగా ఉన్నానంటూ క‌విత ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా త‌న‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేందుకే కేంద్రం త‌న పేరును అక్ర‌మంగా ఇరికించిందంటూ ఆరోపించారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ఇదిలా ఉండ‌గా ఈడీ దాఖ‌లు చేసిన సప్లిమెంట‌రీ ఛార్జ్ షీటును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించింది.

క‌విత‌, కేజ్రీవాల్ తో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి తో పాటు మొత్తం 17 మంది పేర్ల‌ను ప్ర‌స్తావించింది. మ‌రోసారి ఎమ్మెల్సీ క‌విత‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం విశేషం.

ఆమె 10 ఫోన్ల‌ను మార్చిన‌ట్లు ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల లావాదేవీలు జ‌రిగిన‌ట్లు గుర్తించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. స‌మీర్ మ‌హేంద్ర నుంచి విజ‌య్ నాయ‌ర్ భారీగా ముడుపులు అందుకున్నార‌ని ..క‌విత‌కు స‌న్నిహితుడైన అరుణ్ పిళ్లై సైతం భారీగా ప్ర‌యోజ‌నం పొందిన‌ట్లు ఆరోపించింది.

ఇక సౌత్ గ్రూప్ లో క‌విత‌, మాగుంట‌, అభిషేక్ బోయిన‌ప‌ల్లి, రామ‌చంద్ర పిళ్లై , బుచ్చిబాబు ఉన్నార‌ని తెలిపింది ఈడీ.

Also Read : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో సీఎం

Leave A Reply

Your Email Id will not be published!