Arvind Kejriwal : ఆప్ జైలుకు భయపడదు – కేజ్రీవాల్
ఎల్జీ నిర్ణయం..కేంద్ర సర్కార్ పై ధ్వజం
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ కు , వారు నియమించిన ఎల్జీకి భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఆప్ సమయం కూడా వచ్చిందన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు వెళ్లేందుకు భయపడ బోమంటూ కుండ బద్దలు కొట్టారు.
శుక్రవారం ఆప్ తీసుకున్న మద్య పాలసీకి సంబంధించి ల అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నవీన్ కుమార్ సక్సేనా సీబీఐ ఎంక్వయిరీ చేయాలంటూ ఆదేశించారు.
దీనిపై ఆప్ నాయకులు, శ్రేణులు భగ్గుమన్నారు. శుక్రవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మీడియాతో మాట్లాడారు. జీఎన్సీటీడీ చట్టం 1991, టీఓబీఆర్ 1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం 2009 పై సమర్పించిన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదికపై సీబీఐ విచారణ చేపట్టాలన్నారు ఎల్జీ.
ఈ సందర్భంగా బెదిరింపులకు, కేసులకు , జైళ్లకు వెళ్లేందుకు భయపడ బోమంటూ చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఆరోగ్య మంత్రిని అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తారని నేను ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని అన్నారు. భారత దేశంలో కొత్త వ్యవస్థ ఉందన్నారు.
అదేమిటంటే ఎవరిని జైలులో ఉంచాలో వారే నిర్ణయిస్తారని , ఆ వ్యక్తపై ఫేక్ కేసు నమోదవుతుందని ఆరోపించారు. ఈ కేసు నకిలీది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. జైళ్లకు వెనుదిరగం.
మాపై అనేక కేసులు బనాయించారు. పంజాబ్ లో విజయం సాధించాక ఆప్ మరింత పుంజుకుందన్నారు. ఆప్ సమయం వచ్చేసింది. జాతీయ స్థాయిలో సత్తా చాటుతామన్నారు.
Also Read : కేజ్రీవాల్ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ