Delhi CM Modi : డబ్బులు ఇచ్చానంటే మోదీని అరెస్ట్ చేస్తారా
సంచలన కామెంట్స్ చేసిన అరవింద్ కేజ్రీవాల్
Delhi CM Modi : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఎవరో తనకు డబ్బులు ఇచ్చానంటే తనకు నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అదే తాను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు చేస్తానని , రూ. 1,000 కోట్లు ఇచ్చానంటే అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. ఆ ధైర్యం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఉందా అని నిలదీశారు ఢిల్లీ సీఎం(Delhi CM Modi) .
కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తిగా ప్రధాని చెప్పినట్టే చేస్తున్నాయని, కోర్టులకు అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎంకు సీబీఐ సమన్లు జారీ చేసింది.16న హాజరు కావాలని ఆదేశించింది. రాజకీయంగా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు అసాధారణ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు కేజ్రీవాల్(Arvind Kejriwal).
ఇప్పటి వరకు చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనంటూ పేర్కొన్నారు. ఫోన్లు ధ్వంసం చేశారని అబద్దం ఎలా చెబుతాయంటూ మండిపడ్డారు. తన మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సహా ఏ ఒక్కరి నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఒక్క ఆధారం కూడా చూపలేక పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా కావాలని చేస్తున్న ప్రయత్నంగా ఆయన ఆరోపించారు. శనివారం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
Also Read : కేజ్రీవాల్ మామూలోడు కాదు