Delhi CM Tour DeadLine : కేజ్రీవాల్ సింగ‌పూర్ టూర్ డెడ్ లైన్ క్లోజ్

కావాల‌నే కేంద్రం ఆపిందంటూ ఆరోప‌ణ

Delhi CM Tour DeadLine : త‌మ దేశంలో జ‌రిగే సెమినార్ కు హాజ‌రు కావాల్సిందిగా ఆహ్వానం ప‌లికింది సింగ‌పూర్ ప్ర‌భుత్వం. ఇందుకు సంబంధించి తాను వెళ్లాల్సి ఉంద‌ని, అనుమ‌తి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి విన్న‌వించారు ముందే ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Delhi CM Tour Over).

దీనికి ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ న‌వీన్ కుమార్ స‌క్సేనా అభ్యంత‌రం తెలిపారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పంపించిన నోట్ ఫైల్ ను తిప్పి పంపించారు.

ఈ సెమినార్ లో కేవ‌లం న‌గ‌ర పాల‌న‌కు సంబంధించిన మేయ‌ర్లు, చైర్మ‌న్లు మాత్ర‌మే పాల్గొనాల‌ని కానీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు చాన్స్ లేదంటూ కొర్రీ విధించారు.

ఎల్జీ నిర్ణ‌యం వెనుక మోదీ కుట్ర దాగి ఉందంటూ నిప్పులు చెరిగారు అర‌వింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సైతం నిప్పులు చెరిగారు. కావాల‌ని తాత్సారం చేశార‌ని, డెడ్ లైన్ ముగిసేంత వ‌ర‌కు స్పందించిన పాపాన పోలేదంటూ ధ్వ‌జ‌మెత్తారు.

కేంద్రం దెబ్బ‌కు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సింగ‌పూర్ లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ సిటీస్ స‌మ్మిట్ లో పాల్గొనే అవ‌కాశాన్ని కోల్పోయారు. ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డ‌మే కాకుండా చాలా ఆల‌స్యంగా వ‌చ్చిందంటూ ఢిల్లీ స‌ర్కార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

సింగ‌పూర్ టూర్ కి సంబంధించిన లాంఛ‌నాల‌ను జూలై 20 నాటికి పూర్తి చేయాల‌ని కోరింది. ఈ ప్ర‌తిపాద‌న‌పై ఎల్జీ వీకే స‌క్సేనా ఒక రోజు తర్వాత అంటే జూలై 21న ఓకే చెప్ప‌డంతో ఉన్న డెడ్ లైన్ కాస్తా ఊసురుమంద‌ని పేర్కొంది స‌ర్కార్.

ప్ర‌యాణ అనుమ‌తి కోసం ఫైల్ ను జూన్ 7న ఎల్జీకి పంపించామ‌ని తెలిపింది.

Also Read : కార్య‌క‌ర్త కుటుంబానికి స‌ర్కార్ భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!