Delhi Court Notice : సిసోడియా బెయిల్ పై సీబీఐకి నోటీసులు
జారీ చేసిన ఢిల్లీ కోర్టు
Delhi Court Notice : ఢిల్లీ లిక్కర్ స్కాం, పాలసీ కేసుకు సంబంధించి ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పై సీబీఐకి ఢిల్లీ కోర్టు నోటీసులు(Delhi Court Notice) జారీ చేసింది. ఎందుకు ఆయనకు బెయిల్ ఇవ్వకూడదో చెప్పాలని కోరింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అభ్యర్థనపై జస్టిస్ దినేష్ కుమార్ శర్మ నోటీసు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఏప్రిల్ 20న జరగనుంది.
సిసోడియా బెయిల్ పిటిషన్ పై సీబీఐ స్పందనను ఢిల్లీ హైకోర్టు గురువారం కోరింది. నోటీస్ జారీ చేయండి. ప్రత్యుత్తరం దాఖలు చేయనివ్వండి అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా మార్చి 31న ఇక్కడి ట్రయల్ కోర్టు మనీష్ సిసోడియా అభ్యర్థనను కొట్టి వేసింది. రూ. 100 కోట్ల ముడుపుల చెల్లింపులో కీలక పాత్ర పోషించారంటూ ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.
ఈ మేరకు రిమాండ్ రిపోర్డులో కూడా పేర్కొంది సీబీఐ. ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం నెలకొందని పేర్కొంటూ ఈడీ కూడా రంగంలోకి దిగింది. ప్రస్తుతం మనీష్ సిసోడియా బయటకు వస్తారా రారా అన్న అనుమానం నెలకొంది.
ఇక సిసోడియా తరపున వాదించిన న్యాయవాది జైన్ కోర్టుకు కీలక విషయాలు చెప్పారు. కేంద్ర దర్యాప్తు(Delhi Court Notice) సంస్థలు పదే పదే సోదాలు చేపట్టాయి. కానీ ఆయన ఇంట్లో నుంచి ఎలాంటి లభించలేదని అందుకే క్లయింట్ ను విడుదల చేయాలని కోరారు.
Also Read : సీఎం ఎవరనేది హైకమాండ్ తేలుస్తుంది