Delhi Court : రాహుల్ గాంధీకి లైన్ క్లియర్
10 ఏళ్లు కాదు 3 ఏళ్లకే పాస్ పార్ట్
Delhi Court : ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. ఎంపీగా అనర్హత వేటు పడడంతో తనకున్న అధికారిక పాస్ పోర్ట్ ను సరెండర్ చేశారు. ఈ మేరకు తనకు సాధారణ పాస్ పోర్ట్ జారీ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు(Delhi Court) విచారణ చేపట్టింది శుక్రవారం. కీలక తీర్పు వెలువరించింది. రాహుల్ గాంధీకి ఊరటనిచ్చేలా తీర్పు చెప్పింది కోర్టు.
ఆయన సాధారణ పాస్ పోర్టు పొందవచ్చని , కానీ 10 ఏళ్ల పాటు ఇచ్చేందుకు వీలు కుదరదని స్పష్టం చేసింది. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే వీలవుతుందని కుండ బద్దలు కొట్టింది కోర్టు. కాగా రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసుతో పాటు ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్నారు రాహుల్ గాంధీ. తనకు సాధారణ పాస్ పోర్ట్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
మూడేళ్ల పాటు సాధారణ పాస్ పోర్ట్ ను పొందేందుకు ఢిల్లీ కోర్టు ఇవాళ అనుమతి మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన దౌత్య పాస్ పోర్ట్ ను సరెండర్ చేశాక నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కోసం కోర్టును ఆశ్రయించారు. రాహుల్ దరఖాస్తును పాక్షికంగా అనుమతి ఇస్తున్నాను. కానీ పదేళ్లు మాత్రం కాదు కేవలం మూడేళ్లు మాత్రమేనని పేర్కొన్నారు.
Also Read : Karnataka Cabinet