Delhi Clashes : ఖాకీల వైఫల్యం ఢిల్లీ అల్లర్లకు కారణం
సంచలన వ్యాఖ్యలు చేసిన కోర్టు
Delhi Clashes : హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనపై ఢిల్లీ కోర్టు పోలీసులపై సీరియస్ అయ్యింది. ఖాకీల నిర్లక్ష్యం కారణంగా ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయని, అసలు ఏం చేస్తున్నారో అర్ం కావడం లేదని మండి పడింది.
ఇంత జరుగుతున్న ఇంత బలగాలు పెట్టుకుని ఎందుకు ఆపలేక పోయారని ప్రశ్నించింది కోర్టు. ఒక రకంగా నిలదీసింది. నిట్ట నిలువునా కడిగి పారేసింది.
ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమే. ర్యాలీలను కంట్రోల్ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ మండిపడింది ధర్మాసనం. జహంగీర్ పూరిలో జరిగిన హింసాకాండలో పాల్గొన్న ఎనిమిది మంది వ్యక్తుల బెయిల్ ను ఢిల్లీ(Delhi Clashes) కోర్టు పూర్తిగా తిరస్కరించింది.
వారిని విడుదల చేస్తే వీరంతా సాక్షులను ప్రభావితం చేస్తారంటూ అభిప్రాయపడింది. నిందితులంతా ఈ ప్రాంతంలో పేరు మోసిన నేరస్తులేనని, అందు వల్ల సాక్షులు ఎవరూ ముందుకు రారని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
చట్ట విరుద్దమైన ఊరేగింపును అడ్డుకోనందుకు ఢిల్లీ పోలీసులను(Delhi Clashes) న్యాయమూర్తి తీవ్రంగా మందలించారు. ఇది పోలీసుల వైఫల్యాన్ని ప్రాథమికంగా చూపుతుందని పేర్కొన్నారు.
దోషులైన అధికారులపై జవాబుదారీతనం నిర్ణయించాలని, ఈ విషయంపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసు చీఫ్ ను కోర్టు ఆదేశించింది. సీనియర్ అధికారులు సమస్యను పక్కదారి పట్టించారని కోర్టు పేర్కొంది.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
తాజాగా ఢిల్లీ కోర్టు చేసిన సీరియస్ వ్యాఖ్యలు పోలీసు వర్గాలలో కలకలం రేపాయి. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందని కోర్టు తప్పు పట్టడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : బీహార్ పై మాట్లాడే హక్కు పీకేకు లేదు