Delhi Govt Go Back : మద్యం పాలసీపై ఢిల్లీ సర్కార్ వెనక్కి
తాజా పాలసీపై ఎల్జీ విచారణకు ఆదేశం
Delhi Govt Go Back : కేంద్రం దెబ్బకు ఢిల్లీ సర్కార్ దిగి వస్తోందా అవుననే అనిపిస్తోంది. సింగపూర్ వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించిన వెంటనే ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త మద్యం పాలసీపై షాకిచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్.
ఈ మేరకు కొత్త పాలసీ విధానంపై విచారణ కు ఆదేశించారు వీకే సక్సేనా. దెబ్బకు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రకటించింది తాజాగా ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt Go Back).
దీంతో రిటైల్ మద్యం విక్రయాల పాత పాలసీకి తిరిగి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు మద్యం శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న మనీష్ సిసోడియా తాజాగా ఆరు నెలల కాలానికి పాత ఎక్సైజ్ పాలసీనే తీసుకు రావాలని ఆ శాఖను ఆదేశించింది.
ప్రస్తుతం ఈ ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఎక్సైజ్ పాలసీ 2021-22 జూలై 31తో ముగుస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేయడంతో మద్యం విక్రయాల రీటైల్ లో పాత విధానంలోనే వెళ్లాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ విషయాన్ని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. మరో వైపు ఎక్సైజ్ శాఖ ఇప్పటికీ ఎక్సైజ్ పాలసీ 2022-23పై పని చేస్తోంది. ఇది ఇతర విషయాలతో పాటు ఢిల్లీలో మద్యం హోం డెలివరీని సిఫార్సు చేస్తుంది.
ముసాయిదా పాలసీని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం కోసం ఇంకా పంపాల్సి ఉందన్నారు. కొత్త విధానం వచ్చేంత వరకు ఈ పాత విధానం అమలులో ఉంటుందన్నారు సిసోడియా.
మద్యం విక్రయాల వివరాల కోసం సమన్వయం చేసుకోవాలని ఆర్థిక శాఖ ఎక్సైజ్ కమిషనర్ ను ఆదేశించింది.
Also Read : టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణికి ఈడీ షాక్