Delhi HC Rana Ayyub : ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈడీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. రాణా అయ్యూబ్ లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడాన్ని ప్రశ్నించింది. ఆమెను ఎందుకు ఆపారని ప్రశ్నించింది.
వెంటనే విదేశాలకు వెళ్లనీయండి అంటూ సూచించింది. రాణా అయ్యూమ్ ఎక్కడ ఉంటున్నారో ఏజెన్సీలకు తెలియ చేయమని , కొంత డబ్బు డిపాజిట్ చేయమని స్పష్టం చేసింది.
జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు కొన్ని షరతులతో విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. ఆమె తరపు న్యాయవాది ఈ సందర్భంగా ఈడీ ఏరకంగా వేధింపులకు గురి చేస్తుందో కోర్టుకు వివరించారు.
జస్టిస్ చంద్ర ధారి సింగ్ రిట్ అనుమతించ బడింది. పిటిషన్ పరిష్కరించ బడింది. వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తుందని తెలిపారు.
మనీ లాండరింగ్ కేసులో ఆమెపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ – ఈడీ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ -ఎల్ఓసీ ఆధారంగా రాణా అయ్యూబ్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు గతంలో ముంబై ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు.
ఎల్ఓసీ గురించి ఈడీ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. మీ లుకౌట్ సర్క్యులర్ ను మీరు సమర్థిస్తారు. సమన్లు జారీ చేసినప్పుడల్లా ఆమె బదులిచ్చి అధికారుల ముందు హాజరయ్యేరనేది అంగీకరించిన సత్యం.
విచారణ నుంచి తప్పించుకుంటోందని ఎలా చెబుతారు అంటూ ప్రశ్నించారు జస్టిస్. గత నెల ఫిబ్రవరి 10న దుర్వినియోగం ఆరోపణలపై రాణా అయ్యూబ్(Delhi HC Rana Ayyub) బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 1.77 కోట్ల విలువైన నిధులను ఈడీ అటాచ్ చేసింది.
ఆ ఆరోపణలను ఆమె ఖండిచారు.
Also Read : మేల్కోక పోతే భారత్ లో శ్రీలంక పరిస్థితే