Delhi High Court : జుబైర్ ట్వీట్లతో ఎంత మంది బాధ పడ్డారు
సంచలన కామెంట్స్ చేసిన ఢిల్లీ కోర్టు
Delhi High Court : ఫ్యాక్ట్ చెకర్ , ఆల్టో న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ కు సంబంధించిన కేసును గురువారం విచారణ చేపట్టింది ఢిల్లీ హైకోర్టు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
మత పరమైన మనో భావాలను దెబ్బ తీశాడంటూ 2018లో చేసిన ట్వీట్ పై ఢిల్లీ పోలీసులు గత జూన్ నెలలో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
ఒక రకంగా నిలదీసిందనే చెప్పాలి. జుబైర్ చేసిన ట్వీట్ల వల్ల మనోభావాలు దెబ్బ తిన్నాయని మీరు ఆరోపించారు. సరే మరి ఎంత మంది బాధ పడ్డారో తెలియ చేయాలని స్పష్టం చేసింది కోర్టు(Delhi High Court).
ఈ కేసులో నమోదైన వాంగ్మూలాల సంఖ్య, నేరం చేసిన వ్యక్తుల సంఖ్యపై వివరాలను ఇవ్వాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కోర్టు కోరింది.
ఈ కేసుకు సంబంధించి మీరు ఆరోపణలు చేస్తున్నట్లు లేదా అభియోగాలు మోపిన విధంగా ఇప్పటి వరకు ఎంత మంది బాధితుల వాంగ్మూలాలు నమోదు చేశారు.
ఎంత మంది వీటి ద్వారా బాధకు లోనయ్యారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాకు ట్వీట్లు, రీ ట్వీట్లు ఉన్నాంటూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీ వాస్తవ్ కోర్టుకు వెళ్లడించారు.
దీనిపై న్యాయమూర్తి స్పందించారు. మీరు ట్వీట్లు, రీ ట్వీట్ ల ద్వారా వెళ్లలేరని స్పష్టం చేశారు. ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా వెళ్లి స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని జడ్జి పేర్కొన్నారు.
స్పెషల్ ప్రాసిక్యూటర్ అందుబాటులో లేక పోవడంతో విచారణను వాయిదా వేసిన రెండు రోజుల తర్వాత కోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది.
Also Read : యూపీ సర్కార్ పై సుప్రీంకు వెళతా