Arvind Kejriwal : కాలుష్య నగరాల్లో ఢిల్లీ లేదు – కేజ్రీవాల్
గతంలో ఉండేదని ఇప్పుడు లేదన్న సీఎం
Arvind Kejriwal : ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉండేదన్నారు. ఆసియా ఖండంలో ప్రతిసారి ఢిల్లీ పేరు వచ్చేదని కానీ తాము అధికారంలోకి వచ్చాక దానిని లేకుండా చేశామని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ప్రతి ఏటా కాలుష్య కారక నగరాలను 10 ఎంపిక చేసే వారు.
ఇటీవల ప్రకటించిన నగరాలలో ఢిల్లీకి చోటు దక్కలేదన్నారు. కొన్నేళ్ల కిందట ప్రపంచ కాలుష్య నగరాలలో ఒకటిగా దేశ రాజధానిని ప్రస్తావిస్తూ , ఎంపిక చేస్తూ వచ్చారు. కానీ దానిని రూపు మాపేందుకు తాము శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు సీఎం. ఇందులో భాగంగా ఢిల్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తాము తీర్చిదిద్దే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రకటించిన ఆసియాలోని అత్యంత కాలుష్యకారక నగరాలలో భారత్ కు చెందినవి ఎనిమిది నగరాలు ఉన్నాయని కానీ ఢిల్లీ ఆ జాబితాలో లేదని పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . సోమవారం సీఎం ట్విట్టర్ వేదికగా దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి వీడియోను కూడా పోస్ట్ చేశారు.
ఇక నుంచి మన నగరం ఉండనే ఉండదని కుండ బద్దలు కొట్టారు. కేంద్రం కావాలని తమను తప్పు పట్టే ప్రయత్నం చేస్తోందని దానికి అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప్రజలు చాలా కష్టపడి పని చేశారు. ఇవాళ అభివృద్ధి చెందాం. ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా ఢిల్లీని తీర్చి దిద్దేంత వరకు తాము విశ్రమించే ప్రసక్తే లేదన్నారు సీఎం.
Also Read : అధికారం లేకుండా శాంతి అసాధ్యం – మోదీ