Delhi LG CM : ఆప్ నేతలపై ఎల్జీ పరువు నష్టం దావా
రూ. 1,400 కోట్లు నోట్లు మార్చారంటూ ఆరోపణ
Delhi LG CM : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తున్న వారందరిపై తాను పరువు నష్టం దావా వేస్తానంటూ ప్రకటించారు.
2016లో కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేసింది. ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఖాదీ సంస్థకు చైర్మన్ గా ఉన్నారు ప్రస్తుత ఎల్జీ సక్సేనా. ఆ సమయంలోనే రూ. 1,400 కోట్ల విలువైన నిషేధిత కరెన్సీ నోట్లను మార్చారంటూ ఆప్ నేతలు ఆరోపించారు.
తనపై ఆప్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆరోపించారు లెఫ్టినెంట్ గవర్నర్. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటూ ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ తో సహా ఆప్ నాయకులపై(Delhi LG CM) దావా వేస్తానంటూ బెదిరించారు.
అవన్నీ ఊహాజనిత కల్పనలు తప్ప ఇంకేమీ లేదన్నారు ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా. ఇద్దరు ఉద్యోగులపై తాను ఒత్తిడి తెచ్చారన్నది పూర్తిగా అబద్దమన్నారు.
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది ఇందుకు సంబంధించి. తాము చేసిన కామెంట్స్ అవాస్తవమని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేక పోతే కోర్టుకు ఎక్కుతానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.
ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని పేర్కొన్నారు వినయ్ కుమార్ సక్సేనా. ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ ఖాతాలో కొన్ని పెద్ద నోట్లను జమ చేశారని తెలియగానే విజిలెన్స్ కు ఆదేశించాను.
నలుగురు అధికారులను సస్పెండ్ చేశానని పేర్కొన్నారు ఎల్జీ. సీబీఐ రంగంలోకి దిగిన సమయంలో రూ. 17,07,000 నిషేధిత నోట్లు డిపాజిట్ అయినట్లు , ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు.
Also Read : కాంగ్రెస్ చీఫ్ పోటీకి శశి థరూర్ అర్హుడే