Delhi LG vs CM : కేజ్రీవాల్ డుమ్మా ఎల్జీ సక్సేనా గుస్సా
ప్రచారంలో బిజీ అందుకే హాజరు కాలేదు
Delhi LG vs CM : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ నవీన్ కుమార్ సక్సేనా మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చివరకు గాంధీ జయంతిపై ఎఫెక్ట్ పడింది. అధికారికంగా ప్రతి ఏటా జాతిపిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ప్రతి ఏటా అక్టోబర్ 2న జరగనుంది.
గుజరాత్ లోని పోరుబందర్ లో 1869లో పుట్టారు. 153వ జయంతి నిర్వహించారు. ఎప్పుడైతే ఎల్జీగా సక్సేనా ఢిల్లీకి వచ్చారో ఆనాటి నుంచి సీఎంకు ఎల్జీకి పడడం లేదు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇదిలా ఉండగా గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్.
అధికారికంగా ఎందుకు గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనలేదనే దానిపై క్లారిటీ ఇచ్చింది ఆప్ , ఢిల్లీ ప్రభుత్వం. ఎన్నికల క్యాంపెయిన్ లో బిజీగా ఉండడం వల్లనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా(Delhi LG vs CM) ఆధ్వర్యంలో చేపట్టిన జయంతి కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని స్పష్టం చేసింది.
కాగా దీనిపై సీరియస్ గా స్పందించారు లెఫ్టినెంట్ గవర్నర్. కావాలనే గాంధీ జయంతికి హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ , ఆయన మంత్రివర్గ సహచరులు కావాలని హాజరు కావడం లేదని ఆరోపించారు ఢిల్లీ సీఎం.
దీనిపై బీజేపీ సీరియస్ గా స్పందించింది. సీఎం కేజ్రీవాల్ కు రంగులు మార్చే అలవాటు ఉందని పార్టీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఆరోపించారు.
Also Read : సత్యం మార్గం సులభం కాదు – కేజ్రీవాల్