Delhi Liquor Scam Case : బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్
Delhi Liquor Scam Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ చార్టెర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును కోర్టులో హాజరు పర్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఈ మేరకు సీబీఐ కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది.
ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్ లో అదుపు లోకి తీసుకుంది. విచిత్రం ఏమిటంటే సీబీఐ కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవిత, ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కేసుతో సంబంధం ఉందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఈ విషయం కలకలం రేపింది.
విచిత్రం ఏమిటంటే శుక్రవారం రాత్రి కేంద్ర దర్యాప్తు సంస్థ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ్ మాగుంటను అరెస్ట్ చేసింది. కవిత, మాగుంట రాఘవ్ కలిసి సౌత్ గ్రూప్ గా ఏర్పడ్డారని, గోవాలో జరిగిన ఎన్నికల కోసం రూ. 100 కోట్లు ఆప్ కు చేతులు మారాయని ఆరోపించింది ఈడీ. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవినీతి(Delhi Liquor Scam Case) చోటు చేసుకుందని విచారణకు ఆదేశించారు. తీగ లాగితే డొంక కదిలింది.
ఇంత కాలం ఎవరికీ చిక్కకుండా సీఏ గోరంట్ల బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించాడని, ఈ మొత్తం వ్యవహారంలో మోస్ట్ డేంజరస్ గా ఉన్నారని పేర్కొంది ఈడీ. బుచ్చిబాబు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని ఆరోపించింది. బుచ్చిబాబు ఎమ్మెల్సీ కవిత వద్ద పని చేశాడని, డబ్బులు మార్చాక పక్కకు తప్పుకున్నాడని ఇదంతా ఒక గేమ్ ప్లాన్ లో భాగంగా జరిగిందని స్పష్టం చేసింది ఈడీ.
సీబీఐ అధికారులతో ఏకభవించింది స్పెషల్ కోర్టు. దాంతో ఆడిటర్ బుచ్చిబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ కసట్డీని విధించింది. ఈనెల 25 దాకా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండనున్నారు.
Also Read : ఆప్ కు షాక్ నామినీలు తొలగింపు