Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో ఊరట
ఈడీ నోటీసులపై 26కు విచారణ వాయిదా
Delhi Liquor Scam : హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా శుక్రవారం విచారణ చేపట్టింది. ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసుపై వాదోపవాదాలు జరిగాయి. ఈడీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Delhi Liquor Scam Viral
అవసరమైతే ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) 10 రోజుల పాటు సమయం ఇస్తామని, అంతకంటే ఎక్కువ గడువు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. చట్టం ముందు ఎవరైనా సమానమేనని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లో డిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత హాజరు కావాల్సిందేనని కుండ బద్దలు కొట్టింది.
తప్పించుకునేందుకు వీలు లేదని పేర్కొంది. ఇచ్చిన గడువు పూర్తయ్యాక వెంటనే సమన్లు జారీ చేయడం జరుగుతుందని ప్రకటించింది. ఒకరి కోసం తాము ఆగేది లేదని పేర్కొంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాయిదాలు కోరడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఈడీ తరపు న్యాయవాది.
మొత్తంగా సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున వాదోపవాదనలు జరిగాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి. మరో వైపు ఇదంతా రాజకీయ డ్రామా తప్ప ఇంకేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఇక కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీసింది.
Also Read : Dasun Shanaka : అసలంక గెలిపిస్తాడని తెలుసు