Delhi Mayor Election : ఢిల్లీ బాద్ షా నువ్వా నేనా
ఎవరిని వరించేనో పదవి
Delhi Mayor Election : ఊహించని రీతిలో 15 ఏళ్ల కాషాయ ఆధిపత్యానికి ఆప్ చెక్ పెట్టింది. తాజాగా జరిగిన ఢిల్లీ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో 134 సీట్లు కైవసం చేసుకుని విస్తు పోయేలా చేసింది అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక కంటిన్యూగా అధికారాన్ని చెలాయిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీ కేవలం 104 సీట్లకే పరిమితమైంది.
ఇక కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు సాధిస్తే ఎంఐఎం అడ్రస్ లేకుండా పోయింది. ఇండిపెండెంట్లు సైతం ఆప్ వైపు మొగ్గు చూపారు. దీంతో శుక్రవారం అసలైన పరీక్ష ఎదురు కానుంది ఆప్ కు. లెఫ్టినెంట్ గవర్నర్ అనుకోని రీతిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్ కు ప్రొటెం స్పీకర్ గా నియమించారు.
దీంతో రేపు జరిగే ఎంసీడీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా మొత్తం మేయర్ అభ్యర్థి కోసం ముగ్గురు బరిలో ఉన్నారు. ఇందు కోసం మూడు రంగుల బ్యాలెట్ పేపర్లు కూడా రెడీ చేశారు. మేయర్ ఎన్నికలకు(Delhi Mayor Election) కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దీనితో పాటు డిప్యూటీ మేయర్ , స్టాండింగ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకుంటారు.
ఇందు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మేయర్ ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికలకు ముందు ఢిల్లీ సర్కార్ కు, ఎల్జీ సక్సేనాకు మధ్య వివాదం నెలకొంది. మేయర్ ఎన్నికను ప్రిసైడింగ్ ఆఫీసర్ పని. బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేయడం పై మండిపడ్డారు.
ఇదిలా ఉండగా మేయర్ అభ్యర్థి కోసం బీజేపీ నుంచి రేఖా గుప్తా , ఆప్ నుంచి షెల్లీ ఒబేరాయ్ ఉండగా , డిప్యూటీ మేయర్ పదవికి బీజేపీ నుంచి కమల్ బగ్గీ , ఆప్ నుంచి ఆలే మహ్మద్ ఇక్బాల్ ఉన్నారు. స్టాండింగ్ కమిటీలోని 6 పదవులకు సంబంధించి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కమల్ జిత్ , గజేంద్ర దారల్ , పంకజ్ లూత్రా, ఆప్ నుంచి అమిల్ మాలిక్ , రమీందర్ కౌర్ , మోహిని జిన్వాల్, సారిక చౌదరి ఉన్నారు.
Also Read : ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ