Delhi MCD Results : ఢిల్లీ బల్దియాపై ఆప్ దే జెండా
ముగిసిన కాషాయం ప్రస్థానం
Delhi MCD Results : ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం మరో వైపు కేసులు, అరెస్టులు దేశ రాజధానిలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో తన పట్టును కోల్పోయింది. చీపురుకట్ట గుర్తు కలిగిన ఆప్ పట్టు సాధించింది. ఆశించిన రీతిలో ఎక్కువ సీట్లు రాబట్టుకోలేక పోయినప్పటికీ అద్భుత విజయం నమోదు చేసింది.
ఢిల్లీ నగర పాలక సంస్థపై 15 ఏళ్ల పాటు బీజేపీ పట్టు కలిగి ఉంది. ఈ సుదీర్ఘమైన కాషాయపు యాత్రకు చెక్ పెట్టింది ఆప్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముందు పెట్టి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆప్ పనితీరు ముందు బీజేపీ సీట్లు గెలుచుకోలేక పోయింది.
మొత్తం ఎంసీడీ ఎన్నికల్లో(Delhi MCD Results) 250 సీట్లకు గాను 1,300 మంది పోటీ పడ్డారు. ఇక ఢిల్లీ నగర పాలక సంస్థను చేజిక్కించు కోవాలంటే మొత్తం మెజారిటీ 125 సీట్లు రావాల్సి ఉంది. ఇప్పటికే 135 సీట్లు కైవసం చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. భారతీయ జనతా పార్టీకి 104 సీట్లు దక్కాయి. ఇంకా ఆశ పెట్టుకుంది.
అయితే 10 స్థానాలకు గాను కాంగ్రెస్ 7 స్థానాల్లో విజయం సాధించగా మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఢిల్లీ ఆప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంతోష వాతావరణం నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ వేషధారణతో ధోల్ , చిన్నారులతో భారీ వేడుకలు జరిగాయి.
పెద్ద ఎత్తున సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఉన్నారు.
Also Read : ఢిల్లీ బల్దియా మళ్లీ మాదే – బీజేపీ