Delhi MCD Results : ఢిల్లీ బ‌ల్దియాలో బీజేపీ ఆప్ నువ్వా నేనా

సింగిల్ డిజిట్ కే ప‌రిమిత‌మైన కాంగ్రెస్

Delhi MCD Results : ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేసిన‌ట్టుగానే ఢిల్లీ మ‌హాన‌గ‌ర మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అర‌వింద్ కేజ్రీవాల్ సార‌థ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజ‌లో కొన‌సాగుతోంది. గ‌త కొంత కాలంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ చేతిలో ఉన్న ఈ న‌గ‌రం ఇప్పుడు చీపురు పార్టీకి ద‌క్క‌నుంది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ త్రయం (మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా ) ఎన్ని వ్యూహాలు ప‌న్నినా ప్ర‌భావం చూప‌లేక పోయింది.

తాజాగా ఎంసీడీ ఎన్నిక‌ల ఫ‌లితాలు(Delhi MCD Results) వెలువ‌డుతున్నాయి. మొత్తం 250 వార్డులు ఉన్నాయి. ఆప్, బీజేపీ మ‌ధ్య పోటా పోటీగా కొన‌సాగాయి. ఉద‌యం 8 గంట‌ల నుంచే కౌంటింగ్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు ఆప్ 132 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా బీజేపీ 109 స్థానాల్లో లీడింగ్ లో కొన‌సాగుతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలో ఆధిక్యంలో ఉండ‌గా ఎంఐఎం అడ్ర‌స్ లేకుండా పోయింది. ప్ర‌స్తుతం ఆప్ , బీజేపీ మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగుతోంది. సాయంత్రం దాటితేనే కానీ చెప్ప‌లేం ఎవ‌రికి ఎంత మెజారిటీ వ‌స్తుంద‌నేది. డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు.

2015 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 70 స్థానాల‌కు గాను ఆప్ 67 సీట్లు గెల్చుకుంది. రెండేళ్ల త‌ర్వాత బీజేపీ 272 సీట్ల‌లో 181 సీట్ల‌తో ఎంసీడీని నిల‌బెట్టుకుంది. ఆప్ 48 స్థానాల‌తో రెండో స్థానంలో ఉండ‌గా కాంగ్రెస్ 30 స్థానాల‌తో స‌రి పెట్టుకుంది. దాదాపు 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఏరియాల వారీగా మూడుగా విభ‌జించారు ఎంసీడీని. మొత్తం 250 వార్డుల‌కు 1,300 మంది పోటీ ప‌డ్డారు.

Also Read : 16 కొత్త బిల్లులు ప్ర‌వేశ పెట్ట‌నున్న కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!