Delhi Police Shock Kavitha : జంతర్ మంతర్ వద్ద దీక్ష కుదరదు
ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ పోలీస్ షాక్
Delhi Police Shock Kavitha : మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న న్యూఢిల్లీలో దీక్ష చేపట్టాలని నిర్ణయించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇప్పటికే దేశ రాజధాని లోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు డిసైడ్ అయ్యారు.
ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసులు జారీ చేసింది. 9న హాజరు కావాలని స్పష్టం చేసింది. కానీ తాను దీక్ష చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నానని తాను హాజరు కాలేనంటూ పేర్కొంది. ఈ మేరకు ధర్నా అనంతరం 11న ఈడీ ముందుకు హాజరవుతానని తెలిపారు కల్వకుంట్ల కవిత.
ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతుండగానే ఢిల్లీ పోలీసులు(Delhi Police Shock Kavitha) కోలుకోలేని షాక్ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టేందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ స్పష్టం చేశారు. ఇక్కడ కాకుండా వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
దీంతో ఇది ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఢిల్లీ ఖాకీలు. దీంతో జంతర్ మంతర్ వద్ద దీక్ష కుదరదని అన్నారు. చివరి నిమిషంలో కోలుకోలేని దెబ్బ తగలడంతో డంగ్ అయ్యారు కల్వకుంట్ల కవిత. దీనిపై అంతా చూస్తుండగానే కవిత అసహనం వ్యక్తం చేయడం కనిపించింది.
ఇదే సమయంలో ప్రధాని మోదీని , కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. 2014, 2018 ఎన్నికల సమయంలో బిల్లు తెస్తామని హామీ ఇచ్చారని కానీ వాటిని అమలు చేసిన పాపాన పోలేదని ఆరోపించారు.
Also Read : ఈడీ వచ్చినా సరే నన్ను రమ్మన్నా ఓకే