Delhi Police Knocks : రాహుల్ గాంధీ ఇంటి వద్ద హైడ్రామా
తనకమీ తెలియదన్న కాంగ్రెస్ నేత
Delhi Police Knocks : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఆదివారం ఢిల్లీ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. చాలా సేపు హై డ్రామా చోటు చేసుకుంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో కొందరు మహిళలు తాము లైంగిక వేధింపులకు గురవుతున్నామంటూ తనతో చెప్పారని అన్నారు. దీనిపై ఢిల్లీ పోలీస్ రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. అలా ఆరోపణలు చేసిన వారి వివరాలు తమకు చెప్పాలని కోరారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు(Delhi Police Knocks) చాలా సేపు వేచి ఉన్నారు.
మహిళలపై లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తాను విన్నానని స్టేట్ మెంట్ ఇచ్చారంటూ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి మార్చి 12న గంటకు పైగా నిలబడ్డారు పోలీసులు. వారిని కలుసుకున్నారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత వారు వెళ్లి పోయారు. రాహుల్ గాంధీ తన ఇంటి నుండి తానే కారు నడుపుకుంటూ బయటకు వెళ్లి పోయారు. అయితే మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయారు.
భారత్ జోడో యాత్ర సుదీర్ఘంగా సాగిందని తనకు ఏమీ గుర్తులేదని రాహుల్ గాంధీ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మరోసారి కాంగ్రెస్ నాయకుడికి మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే ఎప్పుడనే విషయం చెప్పలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించింది. సిగ్గు మాలిన చర్యగా అభివర్ణించింది. అదానీ సమస్యపై తమ ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నట్లు ఇది తెలియ చేస్తోందని పేర్కొంది.
Also Read : కవితకు ఛాన్స్ ఇవ్వకండి – ఈడీ