Arvind Kejriwal : జ‌న‌వ‌రి 28 నుంచి ఢిల్లీ షాపింగ్ ఫెస్టివ‌ల్

30 రోజుల పాటు కొన‌సాగుతుంద‌న్న సీఎం

Arvind Kejriwal : దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ కు వేదిక కానుంది దేశ రాజ‌ధాని ఢిల్లీలో. ప్ర‌తి ఏటా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఢిల్లీ ప్ర‌భుత్వం గ‌త కొన్నేళ్లుగా నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ఇదే విష‌యాన్ని ప్ర‌క‌టించారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).

బుధ‌వారం సీఎం మీడియాతో మాట్లాడారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఢిల్లీ షాపింగ్ మాల్ ను వ‌చ్చే జ‌న‌వ‌రి 2023లో ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. జ‌న‌వ‌రి 28 నుంచి మొత్తం నెల రోజుల పాటు కొన‌సాగిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌పంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ ఇది ఒక్క‌టేన‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఈ బిగ్ షాపింగ్ ఫెస్టివల్ ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు త‌మ ప్ర‌భుత్వం ఇప్ప‌టి నుంచే ప‌నులు ప్రారంభిస్తుంద‌ని తెలిపారు.

జ‌న‌వ‌రి 28 నుంచి ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు 30 రోజుల పాటు ఈ షాపింగ్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హిస్తామ‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్. రాబోయే సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వం దీనిని వ‌ర‌ల్డ్ లోనే అతి పెద్ద షాపింగ్ పండుగ గా మారుస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు.

ఢిల్లీని , దాని సంస్కృతిని, వార‌స‌త్వాన్ని అనుభ‌వించేందుకు దేశంలోని వారే కాకుండా ప్ర‌పంచంలోని న‌లుమూలల నుండి ప్ర‌జ‌ల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఇది అసామాన‌మైన షాపింగ్ అనుభ‌వంగా మిగిలి పోతుంద‌న్నారు. భారీగా డిస్కౌంట్లు కూడా ఇస్తామ‌న్నారు. ఢిల్లీ మొత్తాన్ని అలంక‌రించి ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు సీఎం.

ఢిల్లీలోని వ్యాపార‌వేత్త‌ల‌కు ఇది గొప్ప అవ‌కాశ‌మ‌ని చెప్పారు సీఎం(Arvind Kejriwal). వేలాది ఉద్యోగాలు కూడా వ‌స్తాయ‌న్నారు.

Also Read : పంజాబ్ సీఎం పెళ్లికి సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!