Kishan Reddy : పథకం ప్రకారమే విధ్వంసం – కిషన్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపణ
Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. శుక్రవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అగ్నిపథ్ లాంటి స్కీం పలు దేశాల్లో అమలు అవుతోందని చెప్పారు. ఇష్టం ఉన్న వాళ్లు చేరవచ్చని ఎలాంటి బలవంతం చేయడం లేదని అన్నారు. ఇదే సమయంలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి(Kishan Reddy).
ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధాన మంత్రి ఆదేశించారని తెలిపారు. కొందరు ట్వీట్లతో మరింత అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు ఉందని మండిపడ్డారు.
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నో మాధ్యమాలు ఉన్నాయని, ఎన్నో మార్గాలు ఉన్నాయని వాటి ద్వారా అభిప్రాయాలు చెప్పవచ్చని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి(Kishan Reddy).
పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఆందోళనకారులు మాత్రం తాము న్యాయ పరంగా డిమాండ్ చేశామని కానీ కొన్ని రాజకీయ శక్తులు తమను అడ్డం పెట్టుకుని హింసకు పాల్పడ్డారంటూ ఆరోపించారు.
దీనిపై విచారణ కొనసాగించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసు కాల్పుల్లో ఒకరు చని పోయారు. 8 మందికి పైగా గాయపడ్డారు.
Also Read : చంపే హక్కు మీకు ఎవరిచ్చారు