Olena Zelenska : ఇకనైనా ప్రపంచం మేలుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఉక్రెయిన్ దేశ ప్రథమ మహిళ, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కా భార్య ఒలెనా జెలెన్ స్కా.
యుద్ధ కాండను నిరసిస్తూ ప్రపంచ మీడియాకు ఆమె ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా రష్యా చేసిన విధ్వంసాన్ని, మారణ కాండను , యుద్ద బీభత్సాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు.
పుతిన్ పూర్తిగా అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే ఆయన పైకి మాత్రం సైనిక చర్య అంటున్నారని కానీ పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ పై యద్దం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఎలెనా జెలెన్ స్కా(Olena Zelenska).
తమ సాధారణ పౌరులు, ప్రజలపై దారుణ మారణకాండకు పాల్పడ్డారని దీనిని యావత్ ప్రపంచం ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కోక పోతే గనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఊహించని రీతిలో దొంగ దెబ్బ కొట్టేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. మాస్కో మద్దతు గల దేశాల హామీతోనే తమ దేశంపై దాడులకు తెగ బడుతోందంటూ ధ్వజమెత్తారు ఒలెనా జెలెన్ స్కా.
ఇప్పటి దాకా వార్ విషయంలో పుతిన్ చెప్పిన ఏ మాటకు కట్టుబడ లేదని మండిపడ్డారు. పౌరులను టార్గెట్ చేయలేదన్నారు కానీ దారుణంగా దాడులకు పాల్పడ్డారంటూ వాపోయారు.
చాలా మంది శరణార్థులుగా మారారు. చిన్నారులు, అభం శుభం తెలియని మహిళలు, వృద్దులు ఇలా అంతా విగతజీవులుగా తయారయ్యారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు ఉక్రెయిన్ దేశ ప్రథమ మహిళ.
Also Read : మారిన స్వరం చర్చలకు సిద్దం