Supreme Court : న్యాయమూర్తుల వివరాలు ఇవ్వలేం
పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Supreme Court : న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన వివరాలను ఇచ్చేందుకు కుదరదంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు ఇద్దరు న్యాయమూర్తుల నియామకంపై డిసెంబర్ 12, 2018న జరిగిన కొలీజియం సమావేశ వివరాలను ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన ధర్మాసనం(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
న్యాయమూర్తుల వ్యక్తిగత వివరాలు కోర్టు వెబ్ సైట్ లో ఉంటాయని తెలిపింది. అయితే కొలీజియం సమావేశంలో చర్చించిన అంశాలు, ప్రతిపాదించిన వివరాలు మాత్రం వెల్లడించేందుకు వీలు కుదరదని పేర్కొంది. న్యాయమూర్తుల నియామకంపై తమ అత్యున్నత ప్యానెల్ సమావేశం వివరాలను తెలియ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
ఈ చర్చలను ప్రజలకు వెల్లడించ లేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఏదైనా చర్చించబడినా అది పబ్లిక్ డొమైన్ లో ఉండకూడదు. సమావేశంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుని తీర్మానం చేయక పోతే తుది నిర్ణయాన్ని మాత్రమే అప్ లోడ్ చేయాలని పేర్కొంది. ఇదిలా ఉండగా సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరింది.
కానీ అది తిరస్కరించబడింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ దాఖలు చేసింది. ఆ రోజు జరిగిన సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా జస్టిస్ లోకూర్ 2019 జనవరిలో ఆనాటి సమావేశం వివరాలను సుప్రీంకోర్టు సైట్ లో అప్ లోడ్ చేయక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : కొలీజియంపై నోరు జారొద్దు – సుప్రీంకోర్టు